ఆ టాలీవుడ్ డైరెక్టర్‌ను చెప్పుతో కొడతానన్న కీర్తి సురేష్ .. అసలు ఏం జరిగింది ?

by sudharani |   ( Updated:2023-10-12 13:47:39.0  )
ఆ టాలీవుడ్ డైరెక్టర్‌ను చెప్పుతో కొడతానన్న కీర్తి సురేష్ .. అసలు ఏం జరిగింది ?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ‘మహానటి’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ భాషతో సంబందంలేకుండా ఇప్పుడు వరుస చిత్రాలతో దూసుకుపొతుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే చాలా మంది హీరోయిన్లు బ్యాగ్రౌండ్ ఉంటేనే ఇండస్ర్టీలో రాణించగలుగుతారు లేకుంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఒక్కోసారి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ అదే పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒకప్పటి నటి మేనక.. కీర్తికి తల్లి అనే సంగతి మనకు తెలుసు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కీర్తి సురేష్‌కు ఒక స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తానని రమ్మన్నారట. అది నమ్మి ఆడిషన్‌కు వెళ్లిందట కీర్తి. అయితే ఆమెను పూర్తిగా పరిశీలనగా చూసిన టాలీవుడ్ డైరెక్టర్ తన కోరిక తీరిస్తే ఈ బిగ్ ప్రాజెక్టులో హీరోయిన్‌గా చాన్స్ ఇస్తానని చెప్పాడట. దీంతో కోపంతో రగిలిపోయిన కీర్తి ఇంకొకసారి ఎవరితో అయినా ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిందట.

Advertisement

Next Story