స్టార్ హీరోను ఆనందపరచడానికి, అమ్మానాన్నలకు ఇష్టం లేని పని చేస్తున్న కీర్తీ సురేష్!

by Jakkula Samataha |
స్టార్ హీరోను ఆనందపరచడానికి, అమ్మానాన్నలకు ఇష్టం లేని పని చేస్తున్న కీర్తీ సురేష్!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందం, అభినయం ఈమె సొంతం. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో తర్వాత నాని, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఆ సినిమా అంతగా హిట్ కాలేదు. తర్వాత మహానటి సావిత్రి సినిమాలో నటించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఈమె నటనకు చిత్ర పరిశ్రమ ఫిదా అయిపోయింది. అంతేకాకుండా ఈ సినిమాకు గాను కీర్తి ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. చాలా మంది సావిత్రినే భువిపైకి వచ్చిందా అంటూ కీర్తిని పొగిడారు. అలా తన కెరీర్‌ను మలుచుకుంటూ వచ్చిన ఈ బ్యూటీకి ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ తగ్గాయనే చెప్పవచ్చు.

అయితే నటి ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో నటించిన మైదాన్ సినిమా హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో ఒక సినిమాకి కమిట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల అవుతోంది. ఓ హీరో కోసం కీర్తి మొదటి సారి తన పేరెంట్స్‌కు ఇష్టం లేని పని చేస్తోందంట. అక్షయ్ కుమార్ మూవీ రెగ్యులర్ షెడ్యూల్స్ కోసం కీర్తి సురేష్ చెన్నై నుంచి ముంబైకి వెళ్లలేకపోతుందట. ఆ కారణంగానే ముంబైలోనే ఒక ఇల్లు తీసుకొని అక్కడే సెటిల్ కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే తల్లిదండ్రులకు మాత్రం ఆమె ముంబైలో ఉండడం ఇష్టం లేదట. కానీ అక్షయ్ కుమార్ తో సినిమాను వదులుకోవడం కూడా కీర్తి సురేష్ కి ఇష్టం లేదట. ఆ కారణంగానే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే ఆమె ముంబైలో ఉండడానికి నిర్ణయం తీసుకుందట.

Advertisement

Next Story