Karthikdeepam: కార్తీక దీపం ఎఫెక్ట్ .. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న వంటలక్క

by Prasanna |   ( Updated:2023-02-22 07:29:29.0  )
Karthikdeepam: కార్తీక దీపం ఎఫెక్ట్ .. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న వంటలక్క
X

దిశ, సినిమా: 'కార్తీకదీపం' సీరియల్‌తో భారీ పాపులారిటీ సంపాదించుకుంది ప్రేమీ విశ్వనాథ్ (వంటలక్క). ఈ సీరియల్ నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రేమీ విశ్వనాథ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ సీరియల్ కోసం ఉపయోగించిన బ్లాక్ మేకప్ వల్ల ఆమె ఓ వ్యాధిబారిన పడినట్లు తెలుస్తోంది. ముఖంపై మొత్తం మచ్చలు వచ్చాయని, తగ్గడం కోసం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కానీ, దీని గురించి ప్రేమీ విశ్వనాథ్ నుంచి స్పష్టత రావాల్సివుంది. ప్రస్తుతం ఈ నటి నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'కస్టడీ' మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది.

Advertisement

Next Story