మాజీ ప్రియుడిని టార్గెట్ చేసిన హీరోయిన్.. దానికి పనికి రాడంటూ..

by sudharani |
మాజీ ప్రియుడిని టార్గెట్ చేసిన హీరోయిన్.. దానికి పనికి రాడంటూ..
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ నటుడు, మాజీ ప్రియుడు హృతిక్‌ను టార్గెట్ చేసి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన నటి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ అలరించింది. ఈ క్రమంలోనే.. 'హృతిక్ రోషన్, దిల్జీత్ దొసాంజే‌లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు?' అని ఓ నెటిజన్ అడిగాడు.

దీనిపై ఎలాంటి మొహమాటం లేకుండా రిప్లయ్ ఇచ్చిన కంగన.. 'హృతిక్, దిల్జీత్‌.. వీరిద్దరికి నటన రాదు. ఒకరు యాక్షన్, మరొకరు మ్యూజిక్ వీడియోస్ మాత్రమే చేస్తారని అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే వారిద్దరి నటన నేనెప్పుడూ చూడలేదు. ఒకవేళ వాళ్లు నటిస్తే నాకు చెప్పండి' అంటూ కాంట్రవర్సీకి తెరలేపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ఇక హృతిక్‌- కంగన లవ్ ట్రాక్.. చివరకు గొడవలతో ఎండ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed