ప్రభాస్ ‘కల్కి’ నుంచి కమల్ లుక్ వైరల్.. ఇదేంటి ఇలా ఉన్నాడంటూ చర్చించుకుంటున్న ఫ్యాన్స్ (పోస్ట్)

by sudharani |   ( Updated:2024-05-13 20:43:44.0  )
ప్రభాస్ ‘కల్కి’ నుంచి కమల్ లుక్ వైరల్.. ఇదేంటి ఇలా ఉన్నాడంటూ చర్చించుకుంటున్న ఫ్యాన్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘కల్కి 2898AD’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి స్టార్స్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటివరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. అంతే కాకుండా ప్రభాస్ లుక్ మరింత క్రేజీగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ లుక్ లీక్ అయినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లుక్‌లో కమల్ హాసన్ చాలా యంగ్‌‌గా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ప్రభాస్ తరహాలో కాస్ట్యూమ్‌ ధరించాడు. జుట్టు కూడా ఫ్రీగా వదిలేసినట్టుగా ఉంది. ప్రస్తుతం కమల్ న్యూ లుక్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇది నిజంగానే ‘కల్కి’లో కమల్ లుక్ ఏనా.. లేకుండా ఎడిట్ చేశారా అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. కాగా.. లోకనాయకుడు కమల్ హాసన్ ‘కల్కి 2898AD’లో నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు టాక్.

Advertisement

Next Story