పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో కమల్ హాసన్..!

by Hamsa |   ( Updated:2023-06-02 06:39:04.0  )
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమాలో కమల్ హాసన్..!
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కె’. ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో అమితా బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, ప్రాజెక్ట్-కె లో టాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం కమల్ హాసన్‌ను సంప్రదించారట. దీనికి లోకనాయకుడు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి 20 రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కమల్ హాసన్ విలన్ పాత్రేనని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read More... ఒంటినిండా గాయాలతో దేశ సరిహద్దులో హీరోయిన్..! ఫొటోస్ వైరల్

Advertisement

Next Story