'బింబిసార' మరో రికార్డు.. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇదే తొలిసారి..

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-16 13:35:38.0  )
బింబిసార మరో రికార్డు.. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇదే తొలిసారి..
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార మూవీ థియేటర్ల దగ్గర భారీ కలెక్షన్లు సంపాదిస్తుంది. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. తాజాగా 11వ రోజు మరో రికార్డు సాధించింది. 11వరోజు రూ.50 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరుకుంది. ఇప్పటివరకు తెలంగాణ, ఏపీలో రూ.27.56 కోట్ల షేర్ రాబట్టింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికొస్తే రూ.31.61 కోట్ల షేర్(రూ. 52.25 కోట్ల గ్రాస్) సాధించింది. దీంతో కల్యాణ్ రామ్ కెరీర్ లో ఏ సినిమాకు ఇన్ని కలెక్షన్లు రాలేదు. అతడి కెరీర్ లో రూ.50 కోట్ల గ్రాస్ సాధించిన తొలి సినిమాగా ఇది నిలిచింది. బింబిసారలో కల్యాణ్ రామ్ సరసన క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. 11 రోజుల్లో రూ.15.41 కోట్ల లాభాలు సాధించగా.. రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాకు వశిష్ట్ దర్శకత్వం వహించగా.. కీరవాణి, చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

ఇంట్రెస్టింగ్‌గా బింబిసార మేకింగ్ వీడియో..

Advertisement

Next Story