Ghosty Movie OTT Release Date : ఓటీటీలోకి కాజ‌ల్ ‘ఘోస్టీ’ మూవీ

by sudharani |   ( Updated:2023-04-02 13:30:49.0  )
Ghosty Movie OTT Release Date : ఓటీటీలోకి కాజ‌ల్ ‘ఘోస్టీ’ మూవీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ దాదాపు ఏడాదిన్నర గ్యాప్ త‌ర్వాత ‘ఘోస్టీ’ సినిమాతో ఇటీవ‌లే ప్రేక్షకుల ముందుకొచ్చింది. క‌ళ్యాణ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీలో కాజల్ డ్యూయ‌ల్ రోల్ చేసింది. ఇక మార్చి 17న థియేట‌ర్లలో రిలీజైనా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబ‌ట్టలేక‌పోయింది. దీంతో ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 7న జీ5 ఓటీటీలో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిసింది. త‌మిళంతో పాటు తెలుగు భాష‌లో అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read..

సాయి పల్లవి మేకప్ వేసుకోకపోవడానికి కారణం ఇదే..

Advertisement

Next Story