అభిమానులు చేసిన పనికి కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్ట్..

by Hamsa |   ( Updated:2024-06-21 09:52:41.0  )
అభిమానులు చేసిన పనికి కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్ట్..
X

దిశ, సినిమా: తమ అభిమాన హీరో, హీరోయిన్ల పుట్టినరోజు వస్తుందంటే ఫ్యాన్స్ వారం ముందు నుంచే సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటారు. కొంతమంది తమ అభిమానం తెలిపేందుకు.. పాలాభిషేకాలు, రక్తదానాలు చేస్తుంటారు. అయితే ఇటీవల కాజల్ 39వ పుట్టిన రోజు జరుపుకోవడంతో.. కొంత మంది అభిమానులు విషెస్ చెప్పకుండా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఆమె ఈ విషయంపై స్పందించి ఎమోషనల్ అయింది.

అయితే ఫ్యాన్స్ ఆమెకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారంటే.. కాజల్ బర్త్ డే సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్ 150 మందికి భోజనం పంపిణీ చేశారు. అంతేకాకుండా ఈ నెల చివరి లోపు 50 మొక్కలను నాటుతామని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపై కాజల్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ సమాజం పట్ల మీ ఆలోచన, దయ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే ఫుడ్ పంపిణీ చేసిన వీడియోను షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed