యముడి పాత్రలో కైకాల చివరి సినిమా ఇదే!

by GSrikanth |   ( Updated:2022-12-23 03:18:26.0  )
యముడి పాత్రలో కైకాల చివరి సినిమా ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: యముడు అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది కైకాల సత్యానారాయణ. తెలుగు చిత్ర పరిశ్రమలో పదుల సంఖ్యలో యముడి పాత్రల్లో నటించిన కైకాల సత్యానారాయణ అభిమానుల గుండెళ్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా 'నవసర నటనా సార్వభౌమ' అనే బిరుదు పొందారు. పౌరాణిక పాత్రలైన రావణ, దుర్యోధన, యమధర్మరాజు, ఘటోత్కచుని పాత్రలు పోషించి 'భళా' అనిపించారు. సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఏకంగా 101 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. 1935 జులై 25న జన్మించిన కైకాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 700 లకు పైగా చిత్రాల్లో నటించారు. అనంతరం రమా ఫిల్మ్ ప్రొడక్షన్‌ను స్థాపించి.. మెగాస్టార్ చిరంజీవితో కొదమ సింహం సినిమా ఇతర నటులతో బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి చిత్రాలు నిర్మించారు. చివరగా ఆయన రవితేజ నటించిన 'దరువు' చిత్రంలోనూ యముడి పాత్రలో మెప్పించారు.

Also Read....

60 ఏళ్ల ప్రస్థానంలో కైకాల ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?

Advertisement

Next Story