‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజతో ఫైట్ చేసిన నటి నగ్న ఫొటోలు లీక్..

by Hamsa |   ( Updated:2023-06-22 08:39:48.0  )
‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజతో ఫైట్ చేసిన నటి నగ్న ఫొటోలు లీక్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి జయవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రవితేజ ‘విక్రమార్కుడు’ చిత్రంలో ఒరేయ్ సత్తిగా.. బయటకి రా రా సచ్చినోడా’ అంటూ రవితేజతో కయ్యానికి కాలు దువ్విన జయవాణి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ప్రస్తుతం జయవాణి ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే ఇటీవల జయవాణి పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో నగ్న ఫొటోలు, అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేశారు. దానికి బ్లూ టిక్ కూడా ఉండటంతో అందరూ అది జయవాణిదే అనుకున్నారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయవాణి వాటిపై స్పందించింది. ‘‘అసలు నాకు ట్విట్టర్ అకౌంటే లేదు. నా పేరుతో ఎవరో అకౌంట్ ఓపెన్ చేసి ఇలాంటి అడల్ట్ కంటెంట్’ని షేర్ చేస్తున్నారు. చాలా మంది ‘శూర్పణఖ’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారా? అని అడుగుతున్నారు. నేను లేదని చెప్పాను. అయితే ఆ ట్వీట్స్ చూసే నన్ను అడుగుతున్నారని నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. ఆ అకౌంట్‌లో షేర్ చేసి నగ్న ఫొటోలు నావి కావు. దయచేసి ఎవరూ ఆ పోస్టులను నమ్మొద్దు. అది ఫేక్ అకౌంట్. ఇప్పటికైనా ఆ ట్వీట్స్ ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

Read More... తొడలు, నడుము చూపిస్తేనే అవకాశం ఇస్తారా! అర్చన

Advertisement

Next Story