అల్లు ఫ్యామిలీ వేడుకలో జగన్ మావయ్య..! క్రేజ్ మామూలుగా లేదుగా

by Kavitha |
అల్లు ఫ్యామిలీ వేడుకలో జగన్ మావయ్య..! క్రేజ్ మామూలుగా లేదుగా
X

దిశ, సినిమా: ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ అందరికీ సుపరిచితమే. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసిన సరైన హిట్ పడలేదు. ఈ నేపథ్యంలో తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు మరోసారి ఒక కొత్త సినిమాతో మనమందుకు రాబోతున్నాడు. అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది.

అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 'బడ్డీ' చిత్రంలో 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ కూడా నటించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఆయన కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడదామని అజ్మల్ మైక్ పట్టుకోగానే.. అక్కడున్న ఆడియన్స్ ఒక్కసారిగా ''జగన్ మావయ్య.. జగన్ మావయ్య" అంటూ కేకలు వేశారు. మొదట ఆడియన్స్ ఏమన్నారో అర్థం గాక మళ్ళీ అడిగిన అజ్మల్.. ఆ తర్వాత ఏమన్నారో అర్థమై "జగనన్ననా.. ప్రమాణం చేస్తున్నాను" అంటూ వైఎస్ జగన్ ని ఇమిటేట్ చేసి గట్టిగా నవ్వేశాడు.

కాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'వ్యూహం' వంటి సినిమాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించిన విషయం తెలిసిందే. అందుకే అజ్మల్ ని చూడగానే ఆడియన్స్ "జగన్ మావయ్య" అని అరిచారు.


Advertisement

Next Story

Most Viewed