- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పటాస్ ప్రవీణ్‌తో బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా?
దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఒక్కటైన ఫైమా, పటాస్ ప్రవీణ్ గతంలో విడిపోయినట్లు వార్తలొచ్చాయి. ప్రవీణ్ అప్పట్లో వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడని, దీంతో ఫైమా అతడ్ని దూరం పెడుతుందని టాక్ వినిపించింది. ఇకపోతే తాజాగా రష్మి యాంకర్‌గా వ్యవహరిస్తోన్న ‘శ్రీదేవి డ్రామా కంపెన’ షో లో ఫైమా-ప్రవీణ్ సందడి చేశారు. ఈ ఇద్దరి వ్యవహారాన్ని తేల్చేయాలని హైపర్ ఆది, రష్మి, ఇంద్రజలు కలిసి వీరిని నిలదీశారు. ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎట్టకేలకు ప్రవీణ్ ఓపెన్ అయి.. ‘‘ఫైమాకే నేను నచ్చలేదు. నువ్వు నాకు నచ్చలేదని డైరెక్ట్ చెప్పింది’’ అని తెలిపాడు.
తర్వాత ఇద్దరిని కలిసి పట్టుకోవాలని చెప్పగా.. ఫైమా ప్రవీణ్‌ను పట్టుకోవడానికి కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించింది. చివరకు మేమిద్దరం మాట్లాడుకుంటున్నామని బలవంతంగా చెప్పింది. దీంతో రష్మి స్పందించి.. బాగానే ఉంటున్నామని చెబుతున్నావు.. మరీ ప్రవీణ్‌ను పట్టుకునేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని అడగ్గా.. ఫైమా ఏం చెప్పలేకపోయింది. ఇద్దరి మధ్య బలమైన కారణమే ఉంది. కానీ అదేంటో చెప్పలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రవీణ్-ఫైమా కలిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.