- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐకాన్ స్టార్‌పై జబర్దస్త్ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. చితకొట్టిన బన్నీ ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కూటమి ఘన విజయం సాధించింది. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు ఊహించని రితీలో వెలువడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి పలు ప్రాంతాల్లో అల్లర్లు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ నేత కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీలపై తీవ్ర విమర్శలు చేసిన జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ తాజా ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సంచలన కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ మద్దతు పలికిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్రకిశోర్ ఓడిపోయాడని అన్నాడు. రాష్ట్రం కోసం పదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మావయ్య పవన్ కల్యాణ్ కు బన్నీ వ్యతిరేకంగా ఉండడం తనకు నచ్చలేదని నిర్మోహమాటంగా చెప్పేశాడు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందిచకపోయిన.. కిర్రాక్ ఆర్పీ మాత్రం తప్పకుండా స్పందిస్తానని అన్నాడు. పవన్ కు సపోర్ట్ చేయకపోవడం ముమ్మాటికి తప్పని అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. గతంలో కూడా కిర్రాక్ ఆర్పీ బన్నీపై విమర్శలు చేయడంతో ఫ్యాన్స్ ఆర్పీకి సంబంధించిన రెస్టారెంట్‌పై దాడికి పాల్పడ్డారని నెట్టింట జోరుగా వార్తలు వచ్చాయి. ఆయన చేపల పులుసు రెస్టారెంట్ పై దాడి జరిగిందని పలు వీడియోలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి.