Jabardasth Punch Prasad: ‘జబర్దస్త్’ నటుడి హెల్త్ కండీషన్ సీరియస్.. చేతులెత్తేసిన డాక్టర్లు! స్పందించిన సీఎం ప్రత్యేక కార్యదర్శి

by sudharani |   ( Updated:2023-06-09 15:24:43.0  )
Jabardasth Punch Prasad: ‘జబర్దస్త్’ నటుడి హెల్త్ కండీషన్ సీరియస్.. చేతులెత్తేసిన డాక్టర్లు! స్పందించిన సీఎం ప్రత్యేక కార్యదర్శి
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్ధస్త్‌ షో ద్వారా మంచి పేరు తెచ్చుకుని పాపులర్ అయిన వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. ఈయన గత కొంత కాలంగా కిడ్నీల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ మార్పిడి చేస్తే కానీ ఫలితం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ ఆపరేషన్‌ కోసం డబ్బులు లేక ప్రసాద్ కుటుంబసభ్యలు ఇబ్బంది పడుతుండటంతో.. జబర్ధస్త్ నటులు, ఇతరులు కొంతమేర సహాయం చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా కమెడియన్ ఆది ఇతరులను సైతం సాయం చేమయని సోషల్ మీడియా వేధికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో దీనిపై ప్రభుత్వం స్పందించింది.

ఈ మేరకు సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ.. ప్రసాద్‌కు సాయం చేయటానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అప్లికేషన్‌ ప్రాసెస్‌ పూర్తికాగానే సాయం చేస్తామని స్పష్టం చేశారు. పంచ్‌ ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామన్నారు. అంతేకాకుండా అతని కుటుంబసభ్యులతో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ అప్లికేషన్‌ పెట్టిస్తున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని నేరుగా సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

Advertisement

Next Story