అప్పుడే పదేళ్లా.. నమ్మలేకపోతున్న.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Kavitha |   ( Updated:2024-06-25 08:02:23.0  )
అప్పుడే పదేళ్లా.. నమ్మలేకపోతున్న.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన రాశీ ఖన్నా అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో ఎంతో మందిని కట్టిపడేసింది. అనతి కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అదేవిధంగా గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి తాజాగా ‘అరుణ్మణై 4’ అనే తమిళ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేషనల్ మీడియాతో చర్చించింది. ఆమె మాట్లాడుతూ.. నేను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 10 ఇయర్స్ అవుతుంది అంటే నమ్మలేకపోతున్నా. నా ఫస్ట్ సినిమా టైంలో నాకు ఇక్కడి సంస్కృతి, భాషా తెలియదు. అయినా ఇక్కడి వాళ్లు నన్ను అభిమానించి సొంత మనిషిలా చూసుకున్నారు. నాపై నమ్మకంతో డైరెక్టర్స్ నాకు అవకాశాలు ఇస్తునే ఉన్నారు. అదేవిధంగా నా ప్రయాణంలో భాగమై నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను ఊహలు గుసగుసలాడే సినిమా చేస్తున్నప్పుడు మస్తు భయపడ్డా.. కానీ కొన్నేళ్ల తర్వాత నటిగా ఇంత కంఫర్ట్ ఇచ్చిన సినిమా ఇదే కదా అని అనుకున్న. ఈ మూవీ విడుదలై అప్పుడే 10 ఏళ్లు అయిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో నా నటనకు వచ్చిన ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోను. దానికి ఎప్పుడూ నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ వెలకట్టలేనిది అని అన్నారు రాశీ ఖన్నా. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.


Advertisement

Next Story