వేల సంఖ్యలో జనం ముందు.. ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు : రోజా రమణి

by sudharani |
వేల సంఖ్యలో జనం ముందు.. ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు : రోజా రమణి
X

దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ సీనియర్ నటీమణులో రోజా రమణి ఒకరు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు గురించి షాకింగ్ విషయాలు పంచుకుంది. ‘నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఆయనతో నా తొలి సినిమా ‘తాతమ్మ కల’. తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలు చేశాను. అయితే ఎన్టీఆర్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నప్పుడు షూటింగ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకోవడానికి నేను పరుగెత్తి.. కృష్ణా బ్యారేజ్ రెయిలింగ్‌పై ఖాళీ క్యాన్ల మీద నిలబడ్డాను. ఆ క్యాన్లు ఊగుతుండటంతో రామారావు వచ్చి పడిపోకుండా నా కాళ్లు పట్టుకున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా నేను అక్కడ నుంచి కింద పడిపోయేదాన్ని. వేల జనం ముందు ఏ మాత్రం ఆలోచించకుండా రామారావు నా కాళ్లు పట్టుకోవడం ఆశ్చర్యమేసింది’ అని చెప్పుకొచ్చారు రోజా రమణి. ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed