కీర్తి సురేష్‌ను బాయ్‌కాట్ చేస్తాం: టాలీవుడ్ దర్శకులు

by Vinod kumar |   ( Updated:2023-03-01 05:35:50.0  )
కీర్తి సురేష్‌ను బాయ్‌కాట్ చేస్తాం: టాలీవుడ్ దర్శకులు
X

దిశ, సినిమా: ‘మహానటి’ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇప్పటివరకూ గ్లామర్ షో, రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ‘సర్కారి వారి పాట’ సినిమా తర్వాత తన గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ క్రమంలోనే ఓ కోలీవుడ్ సినిమాలో లిప్ లాక్ చేయడానికి సిద్ధపడిందట. దీంతో టాలీవుడ్ డైరెక్టర్లు ఆమెపై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ‘ఇన్నాళ్లు మేము ఎన్నిసార్లు లిప్ లాక్ చేయమన్నా నో అని చెప్పావ్.

ఇప్పుడు మాత్రం కోలీవుడ్ హీరోలతో ఇలాంటి సీన్స్ చేయడానికి సిద్ధపడ్డావా? ఒకవేళ ఈ లిప్ లాక్ సీన్స్‌లో నటిస్తే కీర్తిని తెలుగులో కచ్చితంగా బాయ్ కాట్ చేస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ‘కోలీవుడ్ హీరోలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి.. మనల్ని తక్కువ చేస్తే ఊరుకునేది లేదంటున్నారు. తెలుగు హీరోలు సైతం కీర్తి సురేష్‌పై మండిపడుతున్నట్లు సమాచారం.

Also Read: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తేజ్ సినిమా.. ఆ ఇద్దరు యంగ్ బ్యూటీస్‌కు చాన్స్

Advertisement

Next Story

Most Viewed