- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా గుండె కోస్తే మా బాబాయ్ బాలకృష్ణ కనిపిస్తారు.. జూనియర్ ఎన్టీఆర్
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు అని చెప్పడంలో అతియోశక్తి లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కు తన బాబాయ్ బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుతుంటారు తారక్. అయితే నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. నందమూరి ఫ్యామిలీ తారక్ ను దూరం పెడుతున్నారు అంటూ ఏవేవో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అర్థం లేని వార్తలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. ఈ వార్తల్లో నిజం లేదు అని ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు. అందుకు సాక్ష్యంగా తారక్ బాలకృష్ణ మీద తన ప్రేమ చూపిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదుర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ వేదిక పై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత చేసిన మొదటి సినిమా అదుర్స్. ఈ వేదిక పై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నా గుండె కోస్తే తాతగారు ఎన్టీఆర్ కనిపిస్తారని అందరూ అంటుంటారు.. కానీ నా గుండె కోస్తే మా బాబాయి కనిపిస్తారు అని అన్నారు. నేను క్షేమంగా ఉన్నాను అంటే మా తాతగారి ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మా బాబాయ్ ఆశీస్సుల వల్లే అని ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.