‘సామజవరగమన’ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన అల్లు అర్జున్!

by samatah |   ( Updated:2023-07-05 12:08:26.0  )
‘సామజవరగమన’ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన అల్లు అర్జున్!
X

దిశ, సినిమా: శ్రీవిష్ణు హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘సామజవరగమన’ జూన్ 29న థియేటర్లకు వచ్చింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఆ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవగా తొలిరోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ థియేటర్స్ దగ్గర వినిపించింది. సుమారు రూ.8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు 2.05 కోట్లు గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ వసూలుచేసింది. ఐదో రోజు రూ.1.15 కోట్లు రాబట్టింది. ఇక తాజాగా ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించి మూవీ టీను అభినందించారు. ‘‘సామజవరగమన’ చిత్ర బృందానికి అభినందనలు. చాలా కాలం తర్వాత సరైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ చూసి చాలా ఎంజాయ్ చేశాం. దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారు. రామ్ అబ్బరాజు, శ్రీవిష్ణు, నటుడు నరేష్, వెన్నెల కిషోర్, మలయాళీ, రెబా మోనికా అందరికీ అభినందనలు. 100% తెలుగు వినోదం అందించింది’ అంటూ ట్వీట్ చేశాడు.

Read More..

Pawan kalyan instagram : ఇన్‌స్టాలో పవన్ ఫస్ట్ పోస్ట్ ఏంటో తెలుసా?

Next Story

Most Viewed