నేను మీతో మాట్లాడుతూనే చనిపోవచ్చు.. మా నాన్న, నానమ్మ కూడా: రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

by Anjali |   ( Updated:2023-10-13 14:56:15.0  )
నేను మీతో మాట్లాడుతూనే చనిపోవచ్చు.. మా నాన్న, నానమ్మ కూడా: రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ‘‘టైగర్ నాగేశ్వర రావు సినిమాలోని లవణం ఫ్యామిలీకి చెందిన రోల్‌లో నటిస్తు్న్నాను. ఆ పాత్ర నన్ను ఎంతగానో ఛేంజ్ చేసింది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను పూర్తిగా యాక్టింగ్‌కు దూరం అవ్వలేదు. నాకు హెల్త్ ప్రబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ సమస్య ఉంది. ప్రస్తుతం ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాను. ఎత్తైన చోట నడిస్తే వెంటనే ఆయాసం వస్తుంది. నాకు జనటిక్ సమస్య ఉంది. మా నానమ్మ 47 ఏళ్లలో ఇదే ప్రబ్లమ్‌తో మరణించారు. మా ఫాదర్ కూడా సేమ్ ప్రబ్లమ్‌తో చనిపోయారు. నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేను. ఇప్పుడు మీతో మాట్లాడుతూ సడన్‌గా మరణించవచ్చు. అందులో ఆశ్యర్యం ఏమి లేదు. కానీ నా బాధ అంతా నా పిల్లల గురించే’’ అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story