- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు ఎయిడ్స్ వచ్చింది.. అందుకే సినిమాలు చేయడం లేదు..? స్టార్ హీరో క్లారిటీ!
దిశ, సినిమా: మణిరత్నం తెరకెక్కించిన అందమైన ఫ్యామిలీ డ్రామా ‘మౌనరాగం’ సినిమాలో నటించిన హీరో మోహన్ అందరికీ సుపరిచితమే. ‘కోకిల’ అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే అనతి కాలంలోనే స్టార్ హీరో అయిపోయాడు. తెలుగులో తూర్పు వెళ్ళే రైలు, స్రవంతి, ఆలపాన, ఆత్మకథ, చూపులు కలిసిన శుభవేళ, పోలీస్ రిపోర్ట్, శారదాంబ వంటి సినిమాలు చేశాడు. ఒకానొక దశలో కమల్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలకు పోటీగా నిలిచాడు.
అయితే 1999లో ఆయన డైరెక్ట్ చేసిన ఓ మూవీ ప్లాప్ కావడంతో.. యాక్టింగ్ ఆపేసి.. వెండితెరపై సీరియల్స్ చేయడం స్టార్ చేశాడు. మళ్లీ గ్యాప్ తీసుకుని 2008లో రీ ఎంట్రీ ఇచ్చాడు. 2016లో ఓ తెలుగు సినిమా చేసి తెరమరుగయ్యాడు. మళ్లీ 14 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడే హీరోగా హర మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకున్నాడు.
తాను సినిమాల్లో నటించకపోవడానికి కారణం.. తనకు ఎయిడ్స్ ఉందని, అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాడని, ఆ వ్యాధితో బాధపడుతూ చనిపోయినట్లు వార్తలు వచ్చాయని అన్నారు. ఈ న్యూస్ చూసి చాలా మంది అభిమానులు నమ్మి.. తన ఇంటికి కూడా వచ్చినట్లు చెప్పారు. ఆ సమయంలో తానే కాదు.. తన కుటుంబ సభ్యులు కూడా షాక్ తిన్నామని చెప్పుకొచ్చారు. ఇది కేవలం అబద్ధమని తనకు, తన కుటుంబ సభ్యులకు తెలుసునని, అందుకే తాను పట్టించుకోలేదని అన్నారు. కాగా, హర మూవీతో పాటు వెంకట్ ప్రభు.. విజయ్ కాంబోలో వస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీలో కనిపించబోతున్నాడు ఈ హీరో.