అలాంటి పాత్రలకే నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాను : Sai Pallavi

by Jakkula Samataha |   ( Updated:2024-03-06 15:22:25.0  )
అలాంటి పాత్రలకే నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాను : Sai Pallavi
X

దిశ, సినిమా : నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ తన నటన, డ్యాన్స్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈమె సినిమాలు ఎంచుకునే విధానం, మూవీలో సాయిపల్లవి పాత్ర అందరికీ ఎక్కువగా నచ్చుతుంది. అయితే తాజాగా సాయిపల్లవి రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? చాలా మంది హీరోయిన్స్ పారితోషకం ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయదు. కాగా, దీనిపై ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ రెమ్యునరేషన్ గురించి ఆలోచించలేదు. సినిమా కథ, కంటెంట్, నా క్యారెక్టర్ గురించే ఎక్కువగా ఆలోచిస్తాను. మూవీ మంచి హిట్ కావాలి అంటే కథ చాలా ఇంపార్టెంట్. నేను చేసినా సినిమా మంచి సూపర్ హిట్ అందుకుంటే, మనం వద్దన్నా మేకర్స్ పిలిచి డబ్బులు ఇస్తారు,మరి నాకు రెమ్యునరేషన్ గురించి దిగులు ఎందుకు? నా పాత్రకు తగ్గ రెమ్యూనరేషన్ మేకర్స్ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటారు. నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేయాలి అంటే ఆ పాత్ర నేను చేయలేనటువంటిది నాకు కష్టమైనటువంటిది అయి ఉండాలి.అలాంటి పాత్రలు ఇప్పటివరకు నాకు ఎదురవ్వలేదు .. అందుకే నేను ఏ మూవీకి రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదంటూ తెలిపింది. ప్రస్తుతం సాయిపల్లవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story