- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నడ సినీ ఇండస్ట్రీ తరఫున నేను సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను: హీరో శివరాజ్‌కుమార్ (వీడియో)
దిశ,వెబ్ డెస్క్ : తమిళ హీరో సిద్ధార్థ్‌కు బెంగళూరులో జరిగిన అవమానం పై కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ స్పందించారు. ‘కావేరి సమస్య ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో ఉంది. అప్పటి ఉంచి మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు నటులు ముందుకు రారు అంటున్నారు. మేము వస్తే.. మీ సమస్య పరిష్కారం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. మాకు స్టార్ డమ్ ఇచ్చింది మీరే కదా.. కావాలంటే ఆ స్టార్‌డమ్ మీరే తీసేయండి’ అని శివ రాజ్‌కుమార్ అన్నారు.
ఇక సిద్ధార్థ్ ప్రెస్ మీట్‌ను అడ్డుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ అతని ప్రెస్ మీట్‌ను ఎవరు ఆపారో తెలియదు కానీ.. అలా చేయడం తప్పు. కర్ణాటక ప్రజలు అందరినీ స్వాగతిస్తారు. సమస్యలు అన్ని చోట్లా ఉంటాయి. సమస్యకు పరిష్కారం వెతకాలి.. అంతేకానీ ప్రెస్ మీట్‌లో కూర్చొని మాట్లాడుతున్న మనిషిని అలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు? కన్నడ సినీ ఇండస్ట్రీ తరఫున నేను సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను. ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో బాధించింది’ అని శివరాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.