- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంపరాఫర్ కొట్టేసిన హైపర్ ఆది.. త్వరలో ఎమ్మెల్సీ పదవి
దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది ఒకరు. తన కామెడి టైమింగ్స్‌తో, పంచ్‌లతో నవ్వించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కోసం పిఠాపురం వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
జనసేన పార్టీ కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా కష్టపడ్డ హైపర్ ఆదికి మంచి పదవి ఇచ్చి గౌరవించాలనుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి హైపర్ ఆదికి ఇవ్వాలని జనసేనాని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ రకంగా తనను నమ్ముకుంటే భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయనే సంకేతం ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశ్యంతో హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముందుగా హైపర్ ఆది సహా పార్టీ కోసం పనిచేసిన సినిమా వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవులపై పవన్ కళ్యాణ్, ఇటు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో హైపర్ ఆదిపై తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆది లేదా జనసేనాని గానీ స్పందిస్తేనే అసలు విషయం తెలియనుంది.