- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PAWAN KALYAN: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. ఊహించని గెటప్‌లో పవర్ స్టార్ ఎంట్రీ?
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలకు నెత్తి పట్టుకునే పరిస్థితి నెలకొంది. కాగా పవన్ డేట్స్ కోసం డైరెక్టర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పవర్ స్టార్ ఎన్నికలకు ముందు స్టార్ట్ చేసిన (హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ)మూడు సినిమాలు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో దర్శక, నిర్మాతలు పవన్ డేట్స్ కోసం రిక్వెస్ట్ చేశారట. తాజాగా హరహరవీరమల్లు సినిమా షూటింగ్ కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్టంట్ మాస్టర్ శివ డైరెక్షన్‌లో 400 నుంచి 500 మంది ఫైటర్స్, జూనియర్ ఆర్టిస్టులతో ఫైటింగ్ సీన్స్‌ను చిత్రికరించనున్నారట.
కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరొకొన్ని రోజుల్లోనే షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఊహించని గెటప్‌లో పవర్ స్టార్ దర్శనమివ్వనున్నారని ఈ విషయాన్ని స్వయంగా మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల (ఆగస్టు)14 నుంచి షూటింగ్ మళ్లీ ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ వార్త విన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎగిరిగంతులేస్తున్నారు. ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరికొద్ది రోజుల్లో బాక్సాఫీసు షేక్ కావాల్సిందేనని సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగించారు. తాజాగా ఫ్యాన్స్ ‘వెయిటింగ్ ఫర్ పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన హంగామా స్టార్ట్ చేశారు.