నత్తితో బాధపడుతున్న స్టార్ హీరో.. కథ వింటే కన్నీళ్లు ఆగలేదు..

by samatah |   ( Updated:2023-08-08 11:17:29.0  )
Hrithik Roshan
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ‘కోయి మిల్ గయా’ సినిమాతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2003 రాకేష్ రోషన్ తెరకెక్కించిన మూవీ ఈ ఆగస్టుతో 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడిన హృతిక్.. ‘కొన్ని వరుస పరాజయాల తర్వాత నాకు విజయం రుచి చూపించిన చిత్రమిది. నా జీవితంలోని ఎన్నో సంఘటనలు ఈ మూవీలోని పాత్రకు ఉపయోగపడ్డాయి. ఈ స్క్రిప్ట్ చదవగానే చాలా ఏడ్చాను. దాదాపు ఏడు గంటలు చదివితే నాలుగు గంటలు కన్నీళ్లు ఆగలేదు. ఈ విషయం మా నాన్నకు కూడా చెప్పాను. నాకు నత్తి ఉండేది. దీనివల్ల స్కూల్‌‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇందులో మళ్లీ ఆ నత్తితోనే మాట్లాడాను. నిజంగా ఈ మూవీని గొప్ప పాఠంగా భావిస్తా. మన లైఫ్‌లో ఎదురైన మంచి, చెడులు ఓ టైమ్‌లో ఉపయోగపడతాయి. ప్రతి దానికి టైమ్ రావాలంతే’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తనను తాను నిరూపించుకుంది ఈ సినిమాతోనే అని చెప్పిన హృతిక్.. ఈ కథ తనకు ఎంతో నేర్పిందంటూ ఎమోషనల్ అయ్యాడు.

Read More: Actress Instagram Updates: అందాలను ఆరబోశాం.. కనురాలా చూడండి..!

Advertisement

Next Story