- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనారోగ్యంతోనే స్టార్డమ్ సంపాదించుకున్నా: బాలీవుడ్ హీరో ఎమోషనల్
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన కెరీర్ ఒడిదొడుకుల గురించి ఓపెన్ అయ్యాడు. ఆయన అప్‌కమింగ్ మూవీ 'విక్రమ్ వేద' నుంచి మేకర్స్ తాజాగా ఓ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో.. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పాడు. మొదటి చిత్రం 'కహో నా ప్యార్ హై' చిత్రానికి ముందు తన ఆరోగ్యం బాగాలేదని డాక్టర్స్ చెప్పారన్న హీరో.. యాక్షన్, డ్యాన్స్ చేయొద్దని సూచించడంతో భయాందోళనకు గురైనట్లు తెలిపాడు.
అయితే ఈ విషయాన్ని సవాల్‌గా తీసుకుని ఫిట్‌నెస్‌పై దృష్టి సారించానని.. ప్రస్తుతం యాక్షన్, డ్యాన్స్ ఉన్న సినిమాలతోనే ఫేమ్ సంపాదించుకున్నట్లు వెల్లడించాడు. ఇక తన ఎదుగుదల గురించి ఆలోచిస్తే అద్భుతంగా అనిపిస్తుందన్న హృతిక్.. ఇప్పటికి కూడా సినిమాల్లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని హృతిక్ చెప్పాడు. ఇక రూ. 170కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన 'విక్రమ్ వేద' సెప్టెంబర్ 30న పంచవ్యాప్తంగా విడుదలకానుంది.