Devara Movie: బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దేవర మూవీ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే..?

by Prasanna |   ( Updated:2024-10-03 05:15:01.0  )
Devara Movie: బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దేవర మూవీ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ క్రేజీ కాంబో దేవరతో మరోసారి మన ముందుకొచ్చారు. " ఎన్టీఆర్ ఆర్ట్స్ " సమర్పణలో " యువ సుధా ఆర్ట్స్ " పతాకంపై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

దేవర మూవీ రిలీజ్ కు ముందు పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సినిమాకి మంచి హైప్ ను తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 27న ‘దేవర' పార్ట్ 1 ఆడియెన్స్ ముందుకొచ్చింది. " ఆర్.ఆర్.ఆర్ " తర్వాత ఎన్టీఆర్ సోలో మూవీ కావడంతో.. మిక్స్డ్ టాక్ తో ముందుకెళ్తున్నా.. ‘దేవర’ మంచి ఓపెనింగ్స్ కలెక్ట్ చేసింది. అన్నింటి కంటే హిందీ వెర్షన్ కాస్తా పర్వాలేదు. ఒకసారి నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

‘దేవర’ మూవీకి రూ.174.4 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. 4 రోజులకు ఈ మూవీ రూ.162.22 కోట్ల షేర్ ను వసూలు చేసి.. కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.12.78 కోట్లు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలిచినట్టు. నేడు గాంధీ జయంతి సెలవు కాబట్టి.. ఈ మూవీకి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

Read More : మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్

Advertisement

Next Story