- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెగ్నెన్సీని ‘బైబిల్’ తో పోల్చిన కరీనా కపూర్.. హైకోర్టు నోటీసులు!
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ.. యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు.. మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాలు, సోషల్ మీడియాతో సహా పుస్తకాలు కూడా రాస్తుంది కరీన. ఈ క్రమంలోనే ఇటీవల ఈమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పుస్తకాన్ని బ్యాన్ చేయాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆమె రాసిన పుస్తకంపై ‘బైబిల్’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతికేరిస్తూ న్యాయవాది క్రిస్టోఫర్ అంథోనీ కోర్టును ఆశ్రయించాడు. ఈ బుక్‌పై ‘బైబిల్’ అనే పదం వాడటం క్రైస్తవుల మనోభవాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆయన తన పిటీషన్‌లో తెలిపాడు. క్రైస్తవులు పవిత్ర గ్రంథంగా బైబిల్‌ను భావిస్తారు. అలాంటిది కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం తప్పని చెప్పుకొచ్చాడు. దీంతో నటి కరీనాకు హైకోర్టు నోటీసు జారీ చేయబడింది. ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఆమెకు నోటీసు జారీ చేసింది. కరీనా కపూర్‌పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ క్రిస్టోఫర్ ఆంథోనీ తెలిపారు. అంతే కాకుండా ఆమె రాసిన బుక్‌ను బ్యాన్ చెయ్యాలని ఆ పిటీషన్‌లో ఆయన పేర్కొన్నారు. మరి వివాదం ఎంతో దూరం వెళ్తుందో చూడాల్సి ఉంది.
Read More...
సడెన్‌గా సమంత షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో నెట్టింట మొదలైన కొత్త అనుమానాలు!