మెగా హీరో రామ్ చరణ్‌ను బద్మాష్ అంటూ లైవ్ లోనే తిట్టేసిన హీరోయిన్..!

by Hamsa |   ( Updated:2023-10-01 05:24:01.0  )
మెగా హీరో రామ్ చరణ్‌ను బద్మాష్ అంటూ లైవ్ లోనే తిట్టేసిన హీరోయిన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో ‘గేమ్ ఛేంజర్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా, రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మెగా హీరోని ఓ బాలీవుడ్ హీరోయిన్ లైవ్‌‌లో తిట్టిందట. రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన సినిమా ‘వినయ విధేయ రామ’.

ఈ మూవీ విడుదల క్రమంలో వీరిద్దరూ కలిసి అప్పట్లో ఓ సారి రానా హోస్ట్ గా చేసే నెంబర్ 1. యారి విత్ రానా అనే షోలో పాల్గొని సందడి చేశారు. ఇక ఇందులో రామ్ చరణ్ కియారా అద్వానీని ఆట పట్టిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కియారా అద్వానీ సభకు నమస్కారం అంటూ మాట్లాడింది అంటూ రానా రాంచరణ్ ఇద్దరు నవ్వుకుంటారట. కానీ కియారా మాత్రం నువ్వే కదా అలా మాట్లాడమని చెప్పావు అని చెప్పుంది. దానికి రానా నువ్వేనా అలా మాట్లాడమని అంటే అవును నేనే మాట్లాడమన్నాను అని రాంచరణ్ నవ్వుకుంటాడు. ఇక వీరి సంభాషణ ఫన్నీగా జరుగుతున్న సమయంలో కియారా అద్వానీ నవ్వుకుంటూ బద్మాష్ అంటూ రాంచరణ్ ని అంటుంది. అయితే ఇది కేవలం ఫన్నీ గానే అంటుందట. ప్రస్తుతం కియారా, రామ్ చరణ్‌పై చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story