- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ బంగ్లాను చూడనికే భయపడుతున్న హీరోస్.. అందులోకి వెళ్లిన ఆ స్టార్ హీరోలకు ఏమైందంటే?
దిశ, సినిమా : ఒక ఇంటికి వెళ్లే ముందు చాలా ఆలోచిస్తారు. జ్యోతిష్యులను పిలిపించి, ఇంటి మంచి చెడు, వాస్తు గురించి అడిగి ఆ ఇంట్లో అడుగు పెడుతారు. అయితే కొందరికి అద్దె ఇళ్లు, కొనుగోలు చేసిన ఇల్లులు కలిసి వస్తే మరి కొందరికి ఆర్థిక నష్టాన్ని చేకూరుస్తాయి. అందువలన అద్దె ఇంట్లో లేదా కొనుగోలు చేసిన ఇంట్లో చేరే ముందు చాలా ఆలోచించాలి అంటారు పండితులు.
కాగా, ఓ ఇల్లు ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలను దివాలా తీయించిందంట. ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వారు అనేక సమస్యల బారిన పడటమే కాకుండా ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొన్నారంట. అంతే కాకుండా ఎంత మంచి కథ ఎంచుకొని సినిమా తీసినా, అది అట్టర్ ప్లాప్ అవ్వడం, వరసగా ప్లాప్స్ రావడంతో వారి కెరీర్ ఊహించని విధంగా మలుపు తిరిగినట్లు వారు తెలుపుతున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే..ముంబైలో ఓ అదిరిపోయే బంగ్లా ఉన్నదంట. దాని పేరు ఆశీర్వాద్.దీన్ని బైజు బావ్రా, మీర్జా గాలిబ్, గేట్‌వే ఆఫ్ ఇండియా, బర్సాత్ కీ రాత్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లతో హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ కింగ్ భరత్ భూషణ్ ఈ ఇంటిని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడంట. అయితే ఆయన ఈ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత అప్పుల ఊబిలో చిక్కుకొని చివరకు, పరిస్థితి బాలేక ఉన్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందంట. తర్వాత
మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్లు, రాజేంద్ర కుమార్, రాజేష్ ఖన్నా కూడా ఇదే ఇంట్లో నివసించి ఆర్థిక నష్టాల్లో మునిగిపోయారంట. దీంతో ఆ బంగ్లా అంటే చాలా మందికి భయం మొదలైదంట. ఆ ఇంటి వైపు ఏ స్టార్ హీరో కూడా చూడలేదంట. చివరకు ఓ పారిశ్రామికవేత్త,దాన్ని కొనుగోలు చేసి మరో ఐకానిక్ బంగ్లా కోసం పడగొట్టినట్లు సమాచారం.