నానిని మరో హీరోయిన్‌తో చూస్తే తట్టుకోలేకపోతున్న కొడుకు అర్జున్?

by Prasanna |   ( Updated:2023-08-16 09:12:52.0  )
నానిని మరో హీరోయిన్‌తో చూస్తే తట్టుకోలేకపోతున్న కొడుకు అర్జున్?
X

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని 2012లో అంజనను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు 2017 మార్చి 29న బాబుకు జన్మనిచ్చారు. ఈ బుడ్డోడు పేరు అర్జున్ ఇంట్లో ముద్దుగా జున్నుగాడు అని పిలుచుకుంటారట. అయితే తాజాగా జున్ను గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అర్జున్ నానిని ఏ హీరోయిన్‌తో చూసిన ఒప్పుకోడట. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న మూవీ సాంగ్స్ పెడితే అందులో నాని పక్కన ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే వెంటనే కోపంతో టీవీ ఆఫ్ చేస్తాడట. హీరోయిన్ ఉన్న పాట కాదు నాన్న సోలోగా ఉన్న సాంగ్ పెట్టండి అని అడుగుతాడట. అంటే అర్జున్ దృష్టిలో వాళ్ల అమ్మనే తన హీరోయిన్. ఈ ఫీల్ తన తండ్రి నానికి ఎలా ఉంటుందో తెలియదు. అంజనకు మాత్రం చాలా ముచ్చటగా అనిపిస్తుందట.

Read More: సమంత బాధలో ఉంటే ఏమీ చేస్తుందో తెలుసా? విజయ్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story