‘RX 100’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ.. మరో ఆలోచన ఉందంటూ

by Anjali |   ( Updated:2023-08-24 17:38:00.0  )
‘RX 100’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ.. మరో ఆలోచన ఉందంటూ
X

దిశ, సినిమా: ఈ మద్య చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే కచ్చితంగా సక్సెస్ అవుతోంది. ఇలా చాలా మూవీస్ సంచలన విజయాలు సాధించాయి అందులో ‘ఆర్ఎక్స్ 100’ కూడా ఒకటి. కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంది. పాటలైతే ఇప్పటికీ ట్రెండీగానే వినిపిస్తున్నాయి. అయితే కార్తికేయ ప్రజెంట్ ‘బెదురులంక 2012′ అనే మరో సినిమా‌తో రాబోతున్నాడు. కాగా ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ‘RX 100’ సీక్వెల్ గురించి అతను ప్రస్తావించాడు ‘‘RX100 సీక్వెల్‌ను చాలా మంది కోరుకుంటున్నారు. సీక్వెల్‌ కాదు కానీ, అజయ్‌ భూపతితో మరో మూవీ చేసే ఆలోచన ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : ఇండస్ట్రీలోకి తారక్ తనయుడి ఎంట్రీ?.. ఏకంగా తండ్రి సినిమాతోనే

Advertisement

Next Story