కూతురి హల్దీ పంక్షన్‌లో హీరో అర్జున్ సర్జా ఎమోషనల్ మూమెంట్స్!..

by Kavitha |
కూతురి హల్దీ పంక్షన్‌లో హీరో అర్జున్ సర్జా ఎమోషనల్ మూమెంట్స్!..
X

దిశ, సినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అందరికీ సుపరిచితమే. పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్, ఒకే ఒక్కడు, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, లై వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. హీరోగానే కాకుండా విలన్‌గా నటించి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా అర్జున్ పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య వివాహం జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో కమెడియన్ తంబి రామయ్య కొడుకు యంగ్ హీరో ఉమాపతితో జరగనుండగా ఇప్పటికే వారి ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. దీనిలో భాగంగా ఇప్పటికే హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు(ఐశ్వర్య, ఉమాపతి) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు.

అయితే ఐశ్వర్య, ఉమాపతి ఇద్దరిది లవ్ మ్యారేజ్. కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా.. ఇదే విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇరు కుటుంబ సభ్యులు. గతేడాది అక్టోబర్ లో వీరి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా వీరిద్దరి వివాహం జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగనుంది.

Advertisement

Next Story