తొలిసారి భారత్‌లో ఓటువేసిన హీరో అక్షయ్ కుమార్

by Mahesh |   ( Updated:2024-05-20 07:11:05.0  )
తొలిసారి భారత్‌లో ఓటువేసిన హీరో అక్షయ్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ రోజు ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత లో తన తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు వేశారు. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికి.. అతను 2023 ఆగస్టు నెల వరకు కెనడా పౌరసత్వం కలిగి ఉండగా.. ఆగస్టులో అతనికి భారత ప్రభుత్వం భారతీయ పౌరసత్వాన్ని అధికారకంగా అధించింది. ఆ సందర్భంలో అక్షయ్ తనకు ఇది మర్చిపోలేని రోజు అని తెలిపారు. కాగా ఈ రోజు ముంబైలో ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన.. అక్షయ్ మీడియాతో మాట్లాడుతూ.. 'మేరా భారత్ విక్షిత్ రహే, బాస్ ఉస్సీ కో దిమాగ్ మే రక్తే హుయే మైనే ఓటు కియా. ఉస్సీ హిసాబ్ సే పూరా భారత్ ఓటు కరే, జో ఉంకే దిమాగ్ మే సాహి లగే. "నేను నా భారతదేశం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేశాను. ఓటర్లందరూ దీనిని దృష్టిలో ఉంచుకొని వారి ప్రకారం సరైన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed