- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ .. ఈ రోజు ఎపిసోడ్‌లో జరగబోయేది ఇదే..!!
దిశ, సినిమా: భాగమతిని జాగ్రత్తగా చూసుకోమని రాథోడ్కి చెప్పి ఇంటికి బయలుదేరతాడు అమరేంద్ర. అంతరాత్రి వేళ తనకోసం గుమ్మంలోనే వేచి చూస్తున్న అరుంధతిని చూసి కోప్పడతాడు. ఇంత చలిలో నిల్చోవడం అవసరమా.. లోపల కూర్చోవచ్చు కదా అంటూ మందలిస్తాడు. మీకోసం ఎంతసేపైనా ఎక్కడైనా వేచిచూస్తా అంటుంది అరుంధతి. ఒకరికొకరు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కాసేపు అలా లాన్లో నడుద్దామంటూ అమర్ని అడుగుతుంది అరుంధతి. అంత చలిలో వద్దని, కావాలంటే లోపల నడుద్దామంటూ నచ్చజెప్పుతాడు అమర్.
ఎప్పుడూ తన మాట వినరంటూ అలిగి ఇంట్లోకి వెళ్లిన అరుంధతి పిల్లలు తమకోం సర్ప్రైజ్ చూసి షాకవుతుంది. పిల్లలు పరుగున వచ్చి అమర్, అరుంధతికి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు. కానీ అమర్ వాళ్లపై అరిచి, ఇంకోసారి ఇలా చేస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తాడు. నిద్ర లేకపోతే పొద్దున స్కూల్కి ఎలా వెళ్తారని కోప్పడతాడు. నిరాశపడిన పిల్లలు బాధగా ఇంట్లోకి వెళ్తారు. పిల్లలు ఏదో సరదాగా చేస్తే అంతలా అరవాలా అంటూ అలుగుతుంది అరుంధతి. పిల్లలకు నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండలేరని నచ్చజెప్పుతాడు అమర్. వాళ్లిద్దరి అన్యోన్యతని చూసి అసూయ పడుతుంది మనోహరి. ఇదే మీకు ఆఖరి రోజు అంటూ లోపలికి వెళ్తుంది.
కంటోన్మెంట్లో ఉన్న అరుంధతికి మెలకువ వస్తుంది. రాథోడ్ ఎంత చెప్పినా వినకుండా అక్కడనుంచి వెళ్లిపోతుంది. రాథోడ్ ఎంత బతిమాలిన వినకుండా తన పేరైనా తెలుసుకునే చాన్స్ ఇవ్వదు. అక్కడ నుంచి నేరుగా గుడికి వెళ్తుంది భాగమతి. కల నిజమయ్యేరోజు వచ్చిందని హెచ్చరిస్తాడు స్వామిజీ. భాగమతిని తన రూమ్లో ప్రెష్ అవమని, ఎవరైనా దంపతులు పెళ్లిరోజని గుడికి వస్తే తనకు చెబుతానని భాగమతికి మాటిస్తాడు పూజారి.
ఉదయాన్నే పిల్లలు స్కూల్కి రెడీ అయి అరుంధతిని విష్ చేస్తారు. తాము సరదాగా చేసిన పనికి డాడీ అరిచి అప్సెట్ చేశారని బాధపడతారు. సాయంత్రం పార్టీ ప్లాన్ చేద్దామని వాళ్లకి నచ్చజెప్పుతుంది అరుంధతి. అప్పుడే హాల్లోకి వచ్చిన అమర్ పిల్లల్లో ఒకరు లేరంటూ ఏమైందని అడుగుతాడు. తనకి జ్వరం అంటూ స్కూల్కి వెళ్లలేనని చెబుతుంది అంజలి. కావాలనే అంజలి జ్వరం తెచ్చుకుందని, ఊరికే నటిస్తోందని అర్థమైన మిగతా పిల్లలు అంజలిని ఆటపట్టిస్తారు. తాను అమ్మనాన్న పెళ్లిరోజుని వాళ్లతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికే స్కూల్ మానేసానని చెబుతుంది అంజలి. రాథోడ్ మిగతా పిల్లలని స్కూల్కి తీసుకెళ్తాడు. పిల్లలకి జాగ్రత్తలు చెప్పి పంపుతుంది అరుంధతి.
తన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు జరగాలని రౌడీలకు ఫోన్ చేస్తుంది మనోహరి. ఏం ప్లాన్ అని అడుగుతుంది అంజలి. మీ అమ్మానాన్నలకి సర్ప్రైజ్ ప్లాన్ చేశానని నమ్మిస్తుంది మనోహరి. అంజలి కూడా తల్లిదండ్రులతో గుడికి బయలుదేరుతుంది. గుడకి బయలుదేరుతుంటే అరుంధతిని జాగ్రత్త అని చెప్పి అంజలిని ఆపాలని ప్రయత్నిస్తుంది మనోహరి. అంజలి వినకుండా గుడికి వెళ్తానని మొండికేస్తుంది. అరుంధతి చెప్పడంతో అమరేంద్ర కూడా సరేనంటాడు. మనోహరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పెళ్లిరోజే అరుంధతి జీవితంలో ఆఖరి రోజవుతుందా? తెలుసుకోవాలంటే ఈరోజు, ఆగస్ట్ 21న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
Read More: సయామికీ స్వయంగా లెటర్ రాసి పంపిన అమితాబ్.. ఆనందంతో నెట్టింట పోస్ట్ చేసిన నటి