- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో ఓటీటీలోకి హనుమాన్.. డైరెక్టర్ క్లారిటీ?
దిశ, సినిమా: తెలుగు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేసజ్జా హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.
ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని నెటిజన్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మార్చి మొదటి వారం లేదా మహాశివరాత్రి రోజు ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఆరోజు వారికి నిరాశే ఎదురయ్యింది. దీంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
అసలు హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా,దీనిపై హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించి, మూవీ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు.త్వరలోనే హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అనౌన్స్మెంట్ రానుందని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడొస్తుంది ?.. ఏ ప్లాట్ ఫామ్ ? ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. ఇంకా ఎన్నిసార్లు ఇలా చెబుతారు.. మాకు ఇంట్రెస్ట్ పోయిందన్న.. జై శ్రీరామ్.. జై హనుమాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇదిలా ఉంటే మార్చి 16న మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.