బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ హీరో తేజకు సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్

by Anjali |
బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ హీరో తేజకు సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో తేజ మాట్లాడుతూ..

‘‘ఈ చిత్రం కోసం నేను 2 ఏళ్లు కష్టపడ్డాను. హనుమాన్ కోసం మరే సినిమా కూడా కమిట్ అవ్వలేదు. ఈ చిత్రంలో ఓ ఫైట్ లో రోకలిబండతో విలన్ మనుషులని కొట్టి ఆ రోకలి, మనిషిని భుజం మీద వేసుకొని నడిచే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ చేసే సమయంలో నా మెడ భాగం చాలా నొప్పి చేసింది. దీంతో నేను షూటింగ్ కూడా రాలేకపోయాను. అంతేకాకుండా క్లైమాక్స్ ఆంజనేయస్వామి వచ్చే షాట్‌లో గాలిలో ఉండాలి. ఈ సీన్ కోసం దాదాపు 5 గంటల పాటు గాలిలోనే ఉన్నాను. 40 రోజుల పాటు దుమ్ము, ధూళి, పొగ మధ్యలో షూట్ చేశాం. ఈ సన్నివేశాలు చేసేటప్పుడు నా కళ్ళకు బాగా ఎఫెక్ట్ అయింది. ఆసుపత్రికి వెళ్తే కార్నియా దెబ్బ తిందని, డాక్టర్లు.. కన్నుకు సర్జరీ చేయాలని చెప్పారు. కానీ మూవీ రిలీజయ్యాక సర్జరీ చేయించుకుంటానని అన్నాను’’ అంటూ తేజ సజ్జా చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ తేజను పొగిడేస్తూనే.. మరోవైపు బాధను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed