- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్లోబల్ ట్రెండింగ్ 1గా ‘హనుమాన్’.. ఓటీటీలో రికార్డుల వేట
దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా తాజా సినిమా ‘హనుమాన్’. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి రికార్డులను సృష్టించింది. బడా హీరోల సినిమాలను పక్కకు నెట్టి మరీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మోత మోగించింది. అంతే కాకుండా 150 థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుని మరో రికార్డును అందుకుంది. అయితే.. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదరుచూడని వారు అంటూ ఉండరు. ప్రజల ఆరాటానికి తగ్గట్టుగానే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కూడా లేట్ అవుతూనే వచ్చింది.
ఇక ఎట్టకేలకు ఆదివారం నుంచి ‘హనుమాన్’ మూవీ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియమ్‌లో కూడా దూసుకుపోతోంది. ఓటీటీలోకి వచ్చిన కేవలం 11 గంటల్లోనే హనుమాన్ 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసింది. దీంతో జీ5లో ఇంతకు ముందున్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా జీ5 ఓటీటీ సంస్థ X వేదికగా పంచుకుంది. ఈ మేరకు ‘రికార్డులు బద్దలయ్యాయి.. హృదయాలు గెలిచాయి! హనుమాన్ ఇప్పుడు ZEE5లో తెలుగు, ఇంగ్లీష్‌లో కూడా ప్రసారం అవుతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతో.. ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ఈ సినిమా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Read More..
‘కల్కి 2898 ఏడీ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ ఊరట!