- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Guppedantha Manasu : మను, వసుధార కొట్టిన దెబ్బకు సైలెంట్ అయిన శైలేంద్ర
దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
మను, వసుధార కొట్టిన దెబ్బకు శైలేంద్ర సైలెంట్ అవుతాడు . వీళ్లు నా కంటే మీరు పెద్ద డేంజర్ లా ఉన్నారని వారితో అంటాడు. మిమ్మల్ని నమ్మి నేను ఆ రాజీవ్ గాడిని ప్లాన్ చేసి పోలీసులకు పట్టించా.. ఇప్పుడు వాడికి ఈ నిజం తెలిస్తే నన్ను ఏమి చేస్తాడా అని భయంగా ఉంది.
నువ్వు ఎక్కువ చేస్తే ఈ నిజం ఖచ్చితంగా రాజీవ్‌కు చెబుతానని శైలేంద్రను బెదిరిస్తోంది వసుధార. ఇప్పుడు నీకు ఈ కాలేజీలో ఏ పోస్ట్ లేదు. ఏ ఉద్యోగం కూడా లేదు. టైమ్‌పాస్ కావాలంటే సరదాగా కాలేజీకి రావొచ్చు. అప్పుడే మాకు కూడా మైండ్ కూడా డైవర్ట్ అవుతుందని శైలేంద్రను అవమానిస్తాడు మను. ఆ అవమానం శైలేంద్ర మనసుకి తగులుతుంది. మిమ్మల్ని వదిలిపెట్టనని సీరియస్ గా వారికి వార్నింగ్ ఇస్తాడు.
మను, వసుధార కలిసి దెబ్బ కొట్టిన అవమానాన్ని తట్టుకోలేక తాగేసి శైలేంద్ర ఇంటికి వెళ్తాడు. మెట్లపై కూర్చొని నేను దారుణంగా మోసపోయానని ఏడుస్తుంటాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఊగిపోతూవుంటాడు. భర్తను చూసి చాలా కంగారు పడుతుంది ధరణి. దేవయాని శైలేంద్ర పై నీళ్లు కుమ్మరించి మత్తు మొత్తం దిగేలా చేస్తుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.