Chiranjeevi: చిరుకి గిన్నిస్ రికార్డు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)

by Hamsa |
Chiranjeevi: చిరుకి గిన్నిస్  రికార్డు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవం దక్కించుకున్న విషయం తెలిసిందే. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు. మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ పేరు నమోదు చేశారు. 156 మూవీల్లో 537 పాటల్లో 24000 డాన్స్ స్టెప్స్ వేసినందుకు గానూ ఈ రికార్డు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

అయితే చిరంజీవిపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, రాజమౌళి, చిరంజీవి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడంపై రియాక్ట్ అయ్యారు. ‘‘చిరు కెరీర్‌లో 24000 డాన్స్ మూమెంట్స్ చేశాడని ఇప్పుడే తెలిసింది. అపురూపమైన 46 ఏళ్ల ప్రయాణం! భారతీయ చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు చిరంజీవికి అభినందనలు’’ అని రాసుకొచ్చాడు. అలాగే దండం పెట్టే ఎమోజీలు షేర్ చేశారు.

Twitter : https://x.com/ssrajamouli/status/1837882976803471677

Next Story

Most Viewed