Gruhalakshmi Today నవంబర్ 26 ఎపిసోడ్ తులసిని మధ్యలో రావొద్దన్నా నందు ?

by Prasanna |   ( Updated:2022-11-26 10:33:08.0  )
Gruhalakshmi Today నవంబర్ 26 ఎపిసోడ్  తులసిని మధ్యలో  రావొద్దన్నా నందు ?
X

దిశ, వెబ్ డెస్క్ : నేటి గృహలక్ష్మి సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీన్లు హైలెట్

నేటి ఎపిసోడ్ లో నందు యాక్షన్ మాములుగా లేదు. మా నాన్న గౌరవం నిలబెట్టడానికి నేను ఏమైనా చేస్తా.. అవసరమైతే నా ప్రాణం కూడా ఇస్తా అని నందు చాలా ఎమోషనల్ అవుతాడు. మా అమ్మే మా నాన్న గౌరవాన్ని అవమానపరిచింది. నేను ఇంక బ్రతకను ? నా ప్రాణాన్ని మా నాన్నకు ఇస్తా.. మా నాన్నకు లేకుండా నేను క్షణం కూడా ఉండలేను.. నేను చచ్చిపోతా గట్టిగా అరిచి చెబుతాడు. పిల్లలు తప్పు చేస్తే కన్న తల్లి సరి చేయాలి అంతే కానీ ఆ తల్లి కూడా పిల్లలు చేసినట్టే చేయకూడదంటూ అలా అనుకుంటూ చాలా ఎమోషనల్ అవుతాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన తులసి నేను మీ విషయంలో మాట్లాడకూడదు..కానీ ఒక మాట మాట్లాడాతాను అనడంతో.. ఆ మాటకు నందుకు కోపం వచ్చి తులసిని నోరు మూయిస్తాడు. ఈ గోల ఇలానే సాగుతుంది. వీళ్ళ గోలలో వీరు ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సామ్రాట్ తులసి ఎక్కడికి వెళ్ళిపోయింది.. 'ఇంత వరకూ తులసి కనిపించలేదంటూ అని ఆందోళన పడుతుంటాడు. సామ్రాట్ వాళ్ళ బాబాయ్.. ఈ విధంగా పరంధామయ్య గారు ఇలా చేయడం తప్పు కాదని అంటాడు. ఇలా నేటి ఎపిసోడ్ గొడవలతో సాగుతుంది. తర్వాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Advertisement

Next Story