పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇవాళ ట్రైలర్ విడుదల

by Hamsa |   ( Updated:2023-08-19 08:07:10.0  )
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇవాళ ట్రైలర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మీరా జాస్మిన్ జంటగా నటించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగేంద్ర బాబు నిర్మించారు. ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే , బ్రహ్మానందం, అలీ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 10 2004లో విడుదలై యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే‌కు ఫ్యాన్స్‌కు ముందుగానే ట్రీట్ ఇస్తూ గుడుంబా శంకర్ సినిమాను ఆగస్టు-31న దాదాపు 19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గుడుంబా శంకర్ ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు నాగబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో అది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సారి థియేటర్స్‌లో బాక్సులు బద్దలవడం ఖాయమని అంటున్నారు.

Read More: Akkineni Nageswara Rao : తారక్ ఆ స్టార్ హీరో గురించి తన డైరీలో ఏం రాశాడంటే..?

Advertisement

Next Story