- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలియానాకు బాగా బలుపు.. స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ సంచలన కామెంట్స్..!
దిశ, సినిమా: ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. అంతే కాక బాబుకు జన్మనిచ్చి అందరిని షాక్‌కి గురి చేసింది ఈ భామ. అదే విధంగా ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉండగా కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో ఇలియానాకి బాగా పొగరు అంటూ మాట్లాడిన కామెంట్స్ నెట్టింట దుమారం సృష్టిస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ మూవీలో ఎన్టీఆర్ సరసన ఇలియానా, ఛార్మి హీరోయిన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కృష్ణ వంశీ మాట్లాడుతూ.. చార్మి ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తుంది. కానీ ఆమెకు అన్ని ఫ్లాప్సే వస్తున్నాయి. ఇక రాఖీ సినిమా సమయంలో ఇలియానా యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదు. అయితే ఈమెను నేను సినిమాలో తీసుకోవాలి అనుకోలేదు. కానీ అప్పట్లో ఆమెకు మంచి కమర్షియల్ సినిమాలు వచ్చి పడ్డాయి. దాంతో క్రేజ్ ఉన్న హీరోయిన్ కాబట్టి కొంత మంది బలవంతంగా హీరోయిన్ ని తీసుకొచ్చి సినిమాలో పెట్టారు.
కానీ నాకు మాత్రం ఈ హీరోయిన్ ని పెట్టుకోవాలని లేదు. ఇక ఆ సినిమా చేసే సమయంలో ఆమె చూపించే యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చేది కాదు. ఇక ఆమెతో నేను సినిమా షూటింగ్లో జస్ట్ డైలాగ్స్ చెప్పేవాడిని కానీ ఆ తర్వాత ఆమెను అస్సలు పట్టించుకునే వాడిని కాదు..అంటూ కృష్ణ వంశీ చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా అయినాయి.