ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు అన్నీ వేస్ట్.. మీకు టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: RGV

by Prasanna |   ( Updated:2023-08-01 10:15:59.0  )
ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు అన్నీ వేస్ట్.. మీకు టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: RGV
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రీసెంట్‌గా కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ‘RGV DEN’ అనే పేరుతో స్థాపించిన ఈ ఆఫీస్ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఆఫీస్ మొత్తం అమ్మాయిల న్యూడ్ పిక్స్‌తో నింపేశాడు. అలాగే ఆర్వీ గ్రూప్‌తో కలిసి ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. ఇందులో టాలెంట్ ఉన్న వాళ్లకు, కొత్తవాళ్లకు సినిమా, వెబ్ సిరీస్‌లో అవకాశాలు ఇస్తామని గతంలో ప్రకటించారు. ఇక తాజాగా అవకాశాలకోసం ‘RGV DEN’కు ఎలా అప్లై చేయాలో తెలుపుతూ ఒక వెబ్‌సైట్ రూపొందించినట్లు తెలిపారు. డైరెక్టర్, రైటర్, కెమెరామెన్స్, మ్యూజిక్ డైరెక్టర్లకు ప్రస్తుతం అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. మిగిలిన కేటగిరీస్ కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు. టాలెంట్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవాలని వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

ఈ మేరకు ‘చాలా మంది సరైన అవగాహన లేకుండా ఫిలిం ఇనిస్టిట్యూట్స్‌లో చేరుతున్నారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు ఒక వ్యవస్థగా పాతబడిపోయాయి. డైరెక్టర్‌ కావడానికి అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా పనిచేయాలని చెప్తాయి. అది ఒక జోక్. ఉదాహరణకు శేఖర్ కపూర్, మణిరత్నం, నేను ఎప్పుడూ అసిస్టెంట్‌లుగా పని చేయలేదు. చాలామంది ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌‌లు సినిమా ఇండస్ట్రీకి బాగా పనికొస్తాయనుకుంటున్నారు. కానీ అది తప్పు. మెడికల్ లేదా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను చూశాను. కానీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గ్రాడ్యుయేట్‌ను సీరియస్‌గా తీసుకున్న వాళ్లు ఎదిగినట్లు చూడలేదు. గతంలో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా ప్రపంచస్థాయి చిత్రాల గురించి తెలుసుకోవచ్చు. సినిమాలు తీయొచ్చు. కానీ ఇప్పుడు నెట్‌లోనే అన్ని సినిమాలు దొరుకుతున్నాయి. కేవలం ఫోన్‌తో కావాల్సిన సినిమాని చేయొచ్చు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ కావడమంటే టైం, డబ్బు వేస్ట్ చేసుకోవడం తప్పా లాభం లేదు. అందుకే ఈ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ల గోల లేకుండా మీకు ఇంట్రెస్ట్, టాలెంట్ ఉంటే http://rgvden.com సైట్‌లోకి రండి. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లలో నేర్చుకునేదంతా ఒకే దెబ్బకి ఇక్కడ నేర్చుకోవచ్చు’ అంటూ ట్వీట్టర్ వేదికగా వివరించాడు రామ్ గోపాల్ వర్మ.

Also Read: మరో థ్రిల్లర్ మూవీతో రాబోతున్న అశ్విన్ బాబు

Advertisement

Next Story