కుర్చీ మడతపెట్టి సాంగ్‌తో ఫార్నర్స్ జిమ్ వర్కౌట్స్.. వైరలవుతోన్న వీడియో

by Anjali |
కుర్చీ మడతపెట్టి సాంగ్‌తో ఫార్నర్స్ జిమ్ వర్కౌట్స్.. వైరలవుతోన్న వీడియో
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. క్లాస్‌గా కనిపించే మహేష్ బాబు ఈ సినిమాలో ఊరమాస్ మాటలతో మాస్‌గా కనిపించడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ థియేటర్లలో తెగ హంగామా చేశారు. ఇక ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట బాక్సాఫీసును ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

మహేష్ బాబు-శ్రీలీల వేసిన స్టెప్పులకు బాక్సాఫీసు బద్దలైంది. ఈ మాస్ సాంగ్ థియేటర్‌కెళ్లిన ప్రతి ఒక్కరిలో ఫుల్ జోష్‌ను నింపింది. అయితే తాజాగా మహేష్ కుర్చీ మడతపెట్టి సాంగ్‌ను ఫార్నర్స్ జిమ్ వర్కౌట్స్‌ కోసం ఉపయోగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ కుర్చీ మడతపెట్టి అంటూ ఫారినర్స్ తెగ స్టెప్పులేయడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed