మార్ఫింగ్ ఫోటోతో ఐకాన్ స్టార్‌పై అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2023-07-06 15:46:48.0  )
మార్ఫింగ్ ఫోటోతో  ఐకాన్ స్టార్‌పై అసత్య ప్రచారం..  తిప్పికొట్టిన ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప2’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే గతంలో ప్రభాస్.. ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోన్న సమయంలో ఒక లుక్ మార్ఫింగ్ చేసి ఎలా వైరల్ చేశారో సేమ్ ఇప్పుడు కూడా ఇదే తరహాలో బన్నీ ఫోటో ఒకటి మార్ఫింగ్ చేశారు. ఆ పిక్‌లో అల్లు అర్జున్ గడ్డం లేకుండా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇక్కడి కన్నా నార్త్ ఇండియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన బన్నీ ఫ్యాన్స్ ఈ పిక్ మా అన్నది కాదంటూ తెగ మండిపడుతున్నారు. ‘‘ఇది ఒరిజినల్ కాదు. ఈ పిక్‌ మార్ఫింగ్ అని నిరూపిస్తూ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టారు.’’ ప్రస్తుత రోజుల్లో ఈ మార్ఫింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఏంటో ఈ జనరేషన్’’ అంటూ మరికొందరూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story