- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హనుమాన్ మూవీపై మాజీ ఉప రాష్ట్రపతి ప్రశంసల జల్లు.. ఏమన్నారంటే?
దిశ, వెబ్‌డెస్క్: తేజా సజ్జా హీరోగా యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సారథ్యంతో తెరకెక్కిన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదల అన్ని భాషల్లో పాజిటివ్ రెస్పాన్స్‌తో కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన 15 రోజుల్లోనే 250 కోట్ల మార్క్ దాటి సరికొత్త రికార్టులను సొంతం చేసుకుంది. ఇప్పటికే సినిమా చేసిన పలువురు ప్రముఖులు దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా హనుమాన్ మూవీని రామానాయుడు స్టూడియోలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి వీక్షించారు.
అనంతరం ఆయన అనుభూతిని తన X (ట్విటర్) ఖాతాలో పంచుకున్నారు. ‘ఇప్పుడే హనుమాన్ చలనచిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన ఆంజనేయుడిని స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి ఘట్టం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. నటీనటులు తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, ఇతర నటుల నటన అమితంగా ఆకట్టుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ, చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.