- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Committee Kurrollu: ఆ సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి.. మెగా డాటర్ నిహారిక సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
దిశ, సినిమా: నూతన నటీనటులతో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు యదు వంశీ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ 'మా ఊళ్లో జరిగే జాతరను ప్రేరణ తీసుకుని ఈ కథను రాసుకున్నాను. ప్రతి కుర్రాడు కథ ఇందులో కనిపిస్తుంది. నా నిజ జీవితంలో జరిగిన ఘటనలు కూడా ఈ చిత్రంలో యాడ్ చేశాను. మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇందులో సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. నిహారికకు ఈ కథ నచ్చడంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. డా.జయప్రకాష్ నారాయణ, పవన్‌కళ్యాణ్‌ల స్పీచ్‌లు విని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రాసుకున్నాను. అవి హైలైట్‌గా ఉంటాయి. ఇందులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది.
థియేటర్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయి. మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావోద్వేగాలు.. అన్ని అంశాలను వినోదాత్మకంగా చూపించాం. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లో కూర్చుంటో నిజంగా జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. కథ మీద నమ్మకంతోనే కథకు కావాల్సిన విధంగా కొత్త ఆర్టిస్టులను ఎంపిక చేసుకున్నాను. సినిమా చూసి అగ్ర హీరో చిరంజీవి, యువ కథానాయకుడు వరుణ్ తేజ్ అభినందించడంతో మా సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది. నెక్ట్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కథను రాసుకుంటున్నాను. అందరూ భయపడేలా ఈ కథ ఉంటుంది. ఈ మూవీ పెద్ద హిట్ అయితే.. నేను అనుకున్న హీరోతోనే ఆ సినిమా చేస్తాను' అన్నారు.